శైవ తత్వశాస్త్రానికి చెందిన తిరుజ్ఞాన సంబన్దార్ ఈ ఆలయం గురించి ఏడవ శతాబ్దంలోనే పేర్కొన్నాడు. ఖిల్జీ సేనాని దురాక్రమణదారుడు మాలిక్ కపూర్ దీన్ని కూల్చి వేయించినట్లు చెప్తారు. ఈ దాడిలో గుడికి సంబంధించిన ఆనవాళ్లన్నీ ధ్వంసమైపోయాయి. 16వ శతాబ్దంలో మదురై మొదటి నాయక రాజు విశ్వనాథనాయకుడు ఈ గుడి పునర్నిర్మాణానికి పూనుకున్నాడు. తరువాత తిరుమల నాయక రాజు దీని అభివృద్ధికి పెద్ద ఎత్తున ధన సహాయం చేశాడు.
ఈ ఆలయం నలుదిక్కులా నాలుగు ఎత్తైన రాజగోపురాలతో గంభీరంగా గోచరిస్తుంది. సుందరపాండ్యన్, పరాక్రమ పాండ్యన్లు 13,14 శతాబ్దాల్లో తూర్పు, పశ్చిమ గోపురాలను, 16వ శతాబ్దంలో శివ్వంది చెట్టియార్ దక్షిణ గోపురాన్ని కట్టించారని స్థల పురాణం. తూర్పు గోపురం సమీపంలో అష్టలక్ష్మీ మండపం ఉంటుంది. ఇక్కడ మొత్తం 16 గోపురాలు ఉన్నాయి. గుడి సంప్రదాయం ప్రకారం మొదట మీనాక్షీ అమ్మవారిని దర్శించుకోవాలి. కానీ ఇక్కడికి రావాలంటే తూర్పు వైపున ఉన్న అష్టలక్ష్మీ మంటపం ద్వారా ఆలయ ప్రవేశం చేయాలి. చూపరులను కట్టిపడేసే మరో అద్భుత నిర్మాణం స్వర్ణ కమల తటాకం. ఆలయ ప్రవేశ ద్వారంపై అమ్మవారి కల్యాణ ఘట్టాలు శిల్పాల రూపంలో చెక్కబడ్డాయి.
మీనాక్షి తిరుకల్యాణం ఈ ఆలయంలో జరిగే ముఖ్యమైన పండుగ. దీన్ని ఏటా ఏప్రిల్లో నిర్వహిస్తారు. రథోత్సవం, తెప్పోత్సవంతో పాటు పలు ఉత్సవాలు జరుపుతారు. అమ్మవారి కల్యాణంలాగే అవని మూలోత్సవం
ఇక్కడ ప్రధానంగా నిర్వహించే పండుగ. పదిరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని సుందరేశ్వరుడికి అంకితం చేశారు. నవరాత్రి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.
తమిళనాడులోని మదురై నగరంలో ఆలయం ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి మదురైకు రైలు సౌకర్యం ఉంది. చెన్నై నుంచి ఏడు గంటల ప్రయాణం.
చెన్నై, మదురై మధ్య వైగై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజూ నడుస్తుంది.
విమానమార్గం :
మదురై విమానాశ్రయానికి చెన్నై, తిరుచ్చి, బెంగళూరు, కోయంబత్తూరు నుంచి రోజూ విమాన సర్వీసులు ఉన్నాయి. మదురైకు దేశంలోని ప్రధాన ప్రాంతాలనుండి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
A dip in the Golden Lotus tank, situated in the temple, is considered auspicious and is usually taken before visiting the main shrine of the God and Goddess. As per a legend, the pond was created by Shiva and is even older than the temple. The temple has a hall, which consists of 985 pillars; each pillar is differently and intricately carved. The 12th century colorful temple was among the 30 nominees of the ‘New Seven Wonders of the World’.